సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో టీచర్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని పాఠశాల ఆవరణలో కూర్చొని మీ డిమాండ్లను అధికారులకు చెప్పాలని కోరడంతో పాఠశాల ఆవరణలో బైఠాయించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు పడిన సదరు ఉపాధ్యాయుడు కలగజేసుకొన్నారు. మాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఆందోళనను విరమించి మీ ఇళ్లకు వెళ్లాలని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలియడంతో అడిషనల్ కలెక్టర్ బెన్ శాలం పాఠశాలకు చేరుకున్నారు. ఈ ఘటనపై ఉదయం నుంచి జరిగిన విషయాలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డీఈఓ సస్పెన్షన్..మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు
గురువారం వండిన అన్నంలో మరోసారి పురుగులు రావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీఈఓ ఘనిని సస్పెండ్ చేశారు. అలాగే ఆర్డీఓ, ఎంపీడీఓ, పుడ్ ఇన్‌స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్నంలో పురుగులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా అని ప్రశ్నించారు. ఆయన సొంత డబ్బులతో బియ్యం కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment