ధాన్యం సేకరణవేగవంతం
మక్తల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ బేంషలం అన్నారు. సోమవారం మండలంలోని జక్లేర్‌లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. మక్తల్‌లో మూడు మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతి వచ్చినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట మండల అధికారులు ఉన్నారు.
ఉపాధి పనుల్లోఅక్రమాలను తేల్చాలి
మరికల్: మండలంలోని కన్మనూర్‌లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలను తేల్చాలని ఎంపీ డీకే అరుణ సంబంధిత అధికారులకు సూచించారు. మక్తల్ మండలం జక్లేర్‌లో ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ.. గడిచిన మూడేళ్లలో చేపట్టిన ఉపాధి పనుల్లో దాదాపు రూ. 2.75 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో సహా గ్రామస్తులు గత సెస్టెంబర్‌లో అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా జిల్లావ్యాప్తంగా జరిగిన ఉపాధి పనులపై కూడా సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. సమావేశంలో నాగూరావు నామాజీ ఉన్నారు.
అబుల్ కలాం ఆజాద్ సేవలు మరవలేనివి
నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యరంగానికి చేసిన సేవలు మరవలేనివని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ జానియర్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సొసైటీ కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబర్చిన అభితత్వర్, జిల్లాస్థాయి భోఖో టోర్నీలో సత్తా చాటిన నవీన్‌లను అభినందించి సత్కరించారు. అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డే సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సుదర్శన్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన
విద్య అందించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో బాపుబాటలో– సత్యశోధక యాత్ర పేరుతో ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్ర సోమవారం పీయూకు చేరుకుంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. బాపు చూపిన మార్గము నేటితరం యువతకు అనుసరణీయమన్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల యువతలో మానవత్వపు విలువలు కొరవడాయని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న విజయ్‌కుమార్ మాట్లాడుతూ యువత గాంధీ మార్గంలో నడిచి బాపు కలలుగన్న శాంతియుత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యాత్రలో గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాలని కోరు తూ వేలాదిమంది విద్యార్థులను కలిసి వివరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, భూదాన్ సుబ్బారావు, ప్రొఫెసర్ ప్రసాద్, సంపత్‌రెడ్డి, రవికుమార్, చిన్నాదేవి, గాలెన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment