రుణమాఫీ కాలే.. కొత్త లోన్ ఇవ్వలే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన కె.వెంకటయ్య. ఈయనకు 1.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. మూడేళ్ల క్రితం పోల్కంపల్లి సింగిల్ విండోలో రూ.45 వేల పంట రుణం తీసుకున్నాడు. ఎన్నికలకు ముందు వడ్డీ కట్టమని సింగిల్ విండో అధికారులు ఒత్తిడి తెచ్చారు. డబ్బులు లేక కట్టలేకపోయాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేయగా వెంకటయ్యకు కాలేదు. పాత బకాయి మాఫీ కాకుండా అలాగే ఉండిపోవడంతో కొత్తగా పంట రుణం ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు చేసి.. పంట సాగు చేస్తున్నానని ఆ రైతు వాపోతున్నాడు.
ఎవరూ పట్టించుకోవడం లేదు..
అమరచింతకు చెందిన రైతు రాజేశ్వర్‌రెడ్డికి రెండెకరాల 29 గుంటల పొలం ఉండగా.. బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం పొందారు. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోషపడ్డాడు. కానీ ఇప్పటివరకు అతడి రుణం మాఫీ కాకపోవడంతో నిత్యం వ్యవసాయశాఖ కార్యాలయం, బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. తనకు రుణమాఫీ పథకం వర్తింపజేయాలని కోరుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment