నారాయణపేట: నేటిబాలలే రేపటి పౌరులని, దేశానికి ఉపయోగపడే మార్గ దర్శకులని దేశ సంస్కృతి సాంప్రదాయలను బాల్య దశలో అలవర్చుకోవాలని, తల్లిదండ్రులతోపాటు సమాజంలో పెద్ద వారిని గౌరవించాలని బాలకేంద్ర కన్వీనర్, డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు.
గురువారం బాలకేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించిన నృత్యం, పాటలు చిత్రాలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు అనంతరం చిన్నారుల చేత కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో వైద్య నిపుణురాలు డాక్టర్ గీతవిశ్వనాథ్ జనరల్ ఫిజీషియన్ గందె కార్తీక్, హెచ్‌ఎం నారాయణ, బాలకేంద్ర సిబ్బంది మహిపాల్ రెడ్డి, నర్సింహులు, వసంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment