నర్వ: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాబోవు పరీక్షలకు సన్నద్ధం చేయాలని డీఈఓ అబ్దుల్‌గని అన్నారు. గురువారం పాథర్చేడ్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. శుచి శుభ్రత పాటిస్తూ, మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నారు. అనంతర బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, మహనీయులని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రగతిని తెలుసుకొని వందశాతం ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ గ్రేడ్‌లు సాధించాలని విద్యార్థులకు సూచించారు. సెక్టోరియల్ అధికారి రాజేందర్, నాగార్జున్‌రెడ్డి, యాదయ్యశెట్టి, హెచ్‌ఎం కృష్ణ, ఉపాధ్యాయులు శైలజ, సత్యనారాయణరెడ్డి, సదన్‌రావు, అనిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment