మినహాయింపు దక్కట్లే! | - | Sakshi
Sakshi News home page

మినహాయింపు దక్కట్లే!

Published Mon, Nov 18 2024 1:01 AM | Last Updated on Mon, Nov 18 2024 1:01 AM

మినహా

మినహాయింపు దక్కట్లే!

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం

ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్‌ఎస్‌సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలకు వాటి ప్రతిని అందించాం. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తులు రావడం కొంతమేర కష్టం. బీసీ హాస్టల్‌, కేజీబీవీలకు చెందిన విద్యార్థులు నేరుగా ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు.

– ఎండీ అబ్దుల్‌ఘని, డీఈఓ

నారాయణపేట రూరల్‌: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు తప్పనిసరిగా ఆదాయ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉండగా.. ఇటీవల ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిలో నిబంధనలు విధించడం, దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులకు ఫీజు మినహాయింపు దక్కట్లేదు. మొత్తంగా ప్రభుత్వం ప్రకటించడానికి.. అధికారులు చెప్పుకోడానికే పరిమితమైతంది తప్పా కొందరికే టెన్త్‌ వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు దక్కుతోంది.

వెనకబడిన వారికి మినహాయింపు

అన్ని రకాల యాజమాన్య పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ దృవపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికి ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపచేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్‌ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30 ఏళ్లుగా ఇదే డిజిట్‌ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోతుంది.

హాస్టల్‌లో విద్యార్థులకు ప్రత్యేకం

ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న బీసీ విద్యార్థులకు ఆశాఖ కమిషనర్‌ ఏటా ఇచ్చే ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలుగుతున్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్పేర్‌ గురుకులాలతో పాటు కేజీబీవీ విద్యార్థులు మాత్రమే ఈ రాయితీ నేరుగా పొందుతుండగా, మిగితా విద్యార్థులకు ఈ అవకాశం లభించడంలేదు. కొత్త ప్రభుత్వమైన దీనిపై దృష్టిసారించి వాఱ్షిక ఆదాయం సవరించాలని కోరుతున్నారు.

ఫీజు చెల్లింపు తేదీలు ఇలా..

ఎలాంటి ఫైన్‌ లేకుండా నవంబర్‌ 18

రూ.50 ఫైన్‌తో డిసెంబర్‌ 2

రూ.200 ఫైన్‌తో డిసెంబర్‌ 12

రూ.500 ఫైన్‌తో డిసెంబర్‌ 21

పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే..

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు

పూర్తిస్థాయిలో చేకూరని లబ్ధి

ఏటా 15శాతం మంది మాత్రమే

వినియోగించుకున్న వైనం

వసతిగృహాలు, గురుకులాల వారికి నేరుగా రాయితీ

పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా..

ఏటా అక్టోబర్‌లోనే పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదలకు సంబందించిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లిమెంటరీ విద్యార్థులు 3 సబ్జెక్టులోపునుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గత నవంబర్‌ వరకు ఉండింది. అదేవిధంగా రూ.50 ఫైన్‌, రూ.200, రూ.500 అపరాధరుసుం చెల్లించే గడువు ముగిసింది. గత ఏడాది తత్కాల్‌ పేరుతో రూ.వెయ్యి ఫైన్‌తో పరీక్ష ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వగా ఈ సారి నోటిఫికేషన్‌లో లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
మినహాయింపు దక్కట్లే! 1
1/1

మినహాయింపు దక్కట్లే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement