మార్కెట్‌లో కూరగాయలు, పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధరలు వెచ్చించినా ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడంతో ఇంటి వద్దే కూరగాయాలు, పండ్ల మొక్కలు పెంచడంపై ప్రజలు దృష్టి పెట్టారు. అయితే పట్టణాల్లో అనువైన స్థలం లేకపోవడంతో మిద్దె తోటల సాగుపై ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. తొలుత ఉన్నత వర్గాలు ప్రారంభించగా.. కరోనా ప్రభావం తర్వాత మధ్య తరగతి వర్గాలు సైతం మిద్దె సాగుపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ క్రమంలో పట్టణంలోని ఏనుగొండ, సగర కాలనీ, భగీరథ, రాజేంద్రనగర్, హౌసింగ్‌బోర్డు, బీకేరెడ్డి, మర్లు తదితర కాలనీల్లోని పలు ఇళ్లలో మిద్దె తోటల సాగు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment