నారాయణపేట: తెలంగాణ పబ్లిక్ కమిషన్ గ్రూప్–3 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 4024 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న గ్రూప్–3 పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈమేరకు శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ సైతం భద్రతా చర్యలపై సమీక్షించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్– 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష జరుగుతుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 ఎకానమీ, డెవలప్‌మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు.
గంటన్నర ముందు నుంచే అనుమతి
ఈ పరీక్షలలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, 4 రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపరింటెండ్లను నియమించారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్‌లో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా అభ్యర్థులను 8:30 వరకే లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుండగా 1:30 లోపే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత, అభ్యర్థులను లోపలికి అనుమతించేది ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఇటీవలి దిగిన పాస్ పోర్ట్ సైజు ఫొటో అంటించిన హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ తీసుకొని రావాల్పి ఉంటుందని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, గడియారాలు, ఆభరణాలు, షూస్, టోపీ మొదలగునవి తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బంది ముందుగానే అన్ని కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. పరీక్షా సమయానికి అభ్యర్థులు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా అన్ని రూట్లలో బస్సులు అదనంగా నడపాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తిగా బందో బస్తును నిర్వహించాలని ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రానికి ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు.
144 సెక్షన్ అమలు
గ్రూప్–3 పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్స్ మూసి వేయాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
మార్గదర్శకాలను పాటించాలి
గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇన్విజిలేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కోసం టీజీపీఎస్‌సీ ఇచ్చిన అన్ని మార్గదర్శకాలను ఎటువంటి ఫిరాయింపులు లేకుండా పాటించాలని ఆదేశించారు.
రవితేజ పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది
పరీక్ష కేంద్రం, ఏరియా హాజరుకానున్న
అభ్యర్థులు
కాకతీయ హైస్కూల్, ఆదర్శహిల్స్ 360
శ్రీసాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల, 288
శ్రీసాయి విజయకాలనీ
ద్వారక సెంట్రల్ స్కూల్, సింగారం చౌరస్తా 240
వేదసరస్వతి జూనియర్ కళాశాల, జిల్లా ఆస్పత్రి సమీపాన 240
స్ఫూర్తి డిగ్రీ కళాశాల,శాతవాహన కాలనీ 312
బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్, శ్రీసాయి విజయకాలనీ 312
సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్, 222
సింగార్‌బేష్, ఎల్లమ్మ టెంపుల్
చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రికళాశాల, 564
అంబేద్కర్ చౌరస్తా దగ్గర
క్రిష్ణ గోకులం హైస్కూల్,అంబేద్కర్ చౌరస్తా వద్ద 240
లిటిల్ స్టార్స్ హైస్కూల్, ఆర్డీఓ కార్యాలయం సమీపాన 312
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ, ఎర్రగుట్ట, యాద్గీర్‌రోడ్ 384
గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్,జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 238
రవితేజ హైస్కూల్, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా 312
Comments
Please login to add a commentAdd a comment