అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
నారాయణపేట: గ్రూప్– 3 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తుతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎన్.లింగయ్య సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 100 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, పరీక్ష కేంద్రాల్లోనికి అభ్యర్థులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని, గేటు దగ్గర తగు జాగ్రత్తలు పాటించాలని, దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. పరీక్ష పూర్తి అయ్యి పేపర్లు రిటర్న్ వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఇచ్చేసమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేశాలన్నారు. కార్యక్రమంలో సిఐ శివ శంకర్, పరీక్ష కోఆర్డినేటర్ శంకరయ్య, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణదేవ్, నరేష్, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment