రాజ్యాధికారంతోనే అభివృద్ధి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాజ్యాధికారంతోనే ఏవర్గమైన అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత తరుణంలో రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయని బీసీ, కుల సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే నాయకులు, ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు వినతిపత్రాలను స్వీకరించారు. సంఘాల వారీగా ప్రత్యేకంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజకీయ ప్రాతినిథ్యం లేని కులాలు చాలా ఉన్నాయని, వాటికి కూడా రిజర్వేషన్ల ద్వారా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మొత్తం 65 సంఘాల నాయకులు కమిషన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర పాల్గొన్నారు.
ఎవరేమన్నారంటే..
యాదవులకు పొలిటికల్ పవర్ ఉండాలని, అందుకనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని యాదవ సంఘం అధ్యక్షుడు కాశన్న విన్నవించారు.
రోస్టర్ పద్ధతిలో ఉన్న రిజర్వేషన్‌ను ఎస్టీ ఎరుకులకు తీసి వేశారని, గ్రామాల వారిగా రోస్టర్ తీసుకోవాలని ఎరుకుల సంఘం బాలయ్య కోరారు.
50 కులాలకు ఇంక రాజకీయ ప్రాధాన్యత రాలేదని సగర సంఘం అధ్యక్షుడు ప్రణీల్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలని విన్నవించారు.
పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సంఘం నాయకుడు సారంగి వినయ్‌కుమార్ పేర్కొన్నారు.
సచార్ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు మోసిన్‌ఖాన్ కోరారు.
మేమెంతో.. మాకంత కావాలి
రాజకీయ ప్రాధాన్యం లేకుంటే ఏమీ జరగదు
బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి
స్థానిక సంస్థల్లో ఏబీసీడీ
వర్గీకరణ అమలు చేయాలి
బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు
వెల్లువెత్తిన వినతులు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ బీసీ రిజర్వేషన్ల గుర్తింపుపై బహిరంగ విచారణ
Comments
Please login to add a commentAdd a comment