మక్తల్/మాగనూర్: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఫుడ్‌పాయిజన్‌కు గురైన వంద మంది విద్యార్థుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు పెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడారు. అయితే మొదట తేలికగా తీసుకున్న ఉపాధ్యాయులు.. బాధితులు పెరగడంతో ఏఎన్‌ఎం, ఆశాలను పాఠశాలకు పిలిపించి చికిత్స అందించారు. వారు విద్యార్థుల పరిస్థితిని గమనించి స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ను సైతం పాఠశాలకు పిలిపించారు. ఆయన 17 మంది విద్యార్థులకు చికిత్స అందించి.. అందులో 15 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, నందిని, అనిల్, నవ్య, మేఘన, శివ, జగదీశ్, మహేష్, విజయ్, భీమశంకర్, రాకేష్, విజయ్‌కుమార్, మధు, ప్రశాంతి, శివసాయి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment