ఇంటి వద్దే ఉంటున్నా..
చౌటతండా పాఠశాలలో ముగ్గురం చదువుతున్నాం. స్కూల్‌లో విద్యార్థులు లేరని బడి మూసేస్తున్నట్టు చెప్పారు. కొన్ని రోజులుగా స్కూల్‌కు తాళం వేసి ఉంటోంది. ఇద్దరు విద్యార్థులు గ్రామంలోని ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్నారు. నేను మాత్రం ఇంటి వద్దే ఉంటున్నాను.
– కార్తిక్, విద్యార్థి,
చౌటతండా, బల్మూరు మండలం
బడి తెరిపించాలి..
ఏళ్లుగా విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలను అర్ధంతరంగా మూసివేయడం సరికాదు. చాలావరకు పాఠశాలల్లో ఐదు తరగతులకు కలిపి ఒకే టీచర్ ఉండటంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. కానీ, బడులను మూసేస్తే పేద విద్యార్థులు ఏం కావాలి. ఉన్నతాధికారులు దృష్టిసారించి బడిని తెరిపించాలి. – శంకర్‌నాయక్,
నర్సాయపల్లి, బల్మూరు మండలం
విద్యార్థుల సంఖ్య పెంచుతాం
జీరో విద్యార్థుల నమోదు ఉన్న స్కూళ్లను గుర్తించి తాత్కాలికంగా మూసేస్తున్నాం. పూర్తిగా విద్యార్థులు లేకుంటేనే మూసేస్తాం. కొద్ది మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. మూసేసిన పాఠశాలల్లో సైతం విద్యార్థుల సంఖ్య పెంచి తెరిచేలా చర్యలు చేపడతాం.
– రమేశ్‌కుమార్, డీఈఓ
●
Comments
Please login to add a commentAdd a comment