ఐదు దశాబ్దాలుగా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దేవరకద్రకు మున్సిపాలిటీ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా మారాయి. కానీ స్థానిక పాలకుల నిర్లక్ష్యం వల్ల దేవరకద్రకు ఆ అవకాశం దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీగా మార్చడానికి నాలుగు గ్రామాలతో కలిపి ప్రతిపాదనలు చేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు చేయడంతో దేవరకద్రకు మున్సిపాలిటీ హోదా దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment