కొత్త ఏడాది జోష్
● ఆకట్టుకునేలా కేకులు సిద్ధం
● కానుకలు, డైరీలు, క్యాలెండర్లతోమార్కెట్లు కళకళ
కోస్గి రూరల్: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. స్నేహితులు, ఆత్మీయులు, కుటుంబసభ్యులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు అంతా సిద్ధమవుతున్నారు. కోస్గి పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా అభిరుచులకు తగ్గట్టుగా ఆయా బేకరీలు, స్వీట్ దుకాణ నిర్వాహకులు ఆకట్టుకునేలా కేకులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలాగే, గిఫ్ట్‌లు, డైరీలు, క్యాలెండర్లు వ్యాపారులు అందుబాటులో ఉంచగా రంగుల కోనుగోళ్లతో ఆది, సోమవారం మార్కెట్లు సందడిగా మారాయి. కేకులను బట్టి ధరలు రూ.150 నుంచి రూ.1000 లోపు ధరలు పలుకుతున్నాయి.
ఆకర్శించేలా ఆఫర్లు
ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వచ్చిందంటే చాలు వినియోగదారులను ఆకర్శించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు , బేకరీలు, ఆఫర్లు పెడుతున్నాయి. ఫ్యామిలీ ఫ్యాక్ బిర్యానీ తీసుకుంటే ఆఫ్‌లీటర్ కూల్‌డ్రింక్, విత్ డోర్ డెలివరీ చేయబడునంటూ.. కిలో కేక్ తీసుకుంటే 400 ఎంఎల్ కూల్‌డ్రింక్ ఫ్రీ అంటు ఆఫర్లు పెట్టి ప్రజలను ఆకర్శిస్తున్నారు. నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణా లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు యువత ఏర్పాట్లు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment