మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
మక్తల్: స్వామియే శరణం అయ్యప్ప అంటూ మక్తల్ పుర వీధులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. బుధవారం పట్టణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ నిర్వహించగా.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. ముందుగా అయ్యప్పమాలధారులు స్వామివారికి అభిషేకం, గోమాతకు పూజలు, హోమం నిర్వహించారు. పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చారు. భజనలు, భక్తికీర్తనలతో ఆసాంతం సాగింది. అనంతరం అయ్యప్పస్వామి, గణపతి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని, ఆలయాలను సందర్శించడం పూర్వజన్మ సుకృతమని, దైవభక్తి అలవర్చుకుంటే మనిషి సన్మార్గంలో పయనిస్తాడన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నాయకులు నర్సింహగౌడ్, రాజేష్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, గణేష్‌కుమార్, చంద్రనకాంత్‌గౌడ్, తాయప్ప, అంజనేయులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
మక్తల్‌లో వైభవంగా మహాపడిపూజ
ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment