రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
స్థలాన్ని బట్టి నష్టపరిహారం అందజేస్తాం
నారాయణపేట: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 31 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మేఘా గాంధీ, డీఎస్పీ లింగయ్య, డీఈ రాములు, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, డీపీఆర్‌ఓ రషీద్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, టీజీవో ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లాకు మంచి
పేరు తీసుకురావాలి
నారాయణపేట: కొత్త సంవత్సరం వేల కొత్త లకా్‌ష్య్‌లను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని.. జిల్లా పోలీసులు, సిబ్బంది జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పనితీరు మెరుగుపరుచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని, గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లా పోలీసు వైవిధ్య ఫలితమైన విధానాలను అనుసరిస్తూ నేరాలను నియంత్రించడంలో సునిషితమైన దృష్టి పనితీరుతో ప్రజల మన్ననలను అందుకోవాలని అన్నారు. రోజురోజుకు పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, వాటిని సిబ్బంది అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ ఎన్ లింగయ్య, సిఐలు రామ్‌లాల్, నరసింహ, శివ శంకర్, చంద్ర శేఖర్, రాజేందర్ రెడ్డి, దుస్రు నాయక్ పాల్గొన్నారు. అలాగే, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను మార్యదపూర్వకంగా ఎస్పీ కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కోస్గి: రోడ్డు వెడల్పు పనుల్లో ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న బాధితులకు కమర్షియల్, నినాస, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని స్థలాన్ని బట్టి సంబంధిత శాఖల ఆధికారుల నివేదిక ఆధారంగా నష్టపరిహరం ఆందజేస్తామని ఆర్డీఓ రాంచందర్ సూచించారు. ఈ మేరకు శనివారం మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అధికారుల లెక్కల ప్రకారం రామాలయం చౌరస్తా నుంచి సయ్యద్ పహడ్ దర్గా వరకు 165 మంది బాధితులు ఇళ్లు కోల్పోయారని, వీరిలో కొందరు కోర్టులను ఆశ్రయించారన్నారు. బాధితులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం రూ.7కోట్లు గత నెలలో మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ, మండల సర్వేయర్లు కలిసి నష్టపోయిన బాధితులు స్థలాల వివరాలను సేకరించారన్నారు. ఇంటిని బట్టి గజానికి రూ.4200 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశానికి హాజరైన వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ అభివృద్ధికి సహకరిస్తామని 100 మందికి పైగా సమ్మతి పత్రాలపై సంతకాలు చేసి అధికారులకు అందజేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించిన వారిలో అందుబాటులో ఉన్న వారితో సైతం అధికారులు చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ నాగరాజు, ఆర్‌అండ్‌బీ అధికారులు, సర్వే అధికారులు, కాంగ్రెస్ నాయకులు బెజ్జు రాములు, నాగులపల్లి నరేందర్, కోడిగంటి హరి, మేకల రాజేష్, నాగులపల్లి శ్రీనివాస్‌తోపాటు పలువురు ఉన్నారు.
24 గంటలపాటు భగీరథ నీటి సరఫరా నిలిపివేత
మరికల్: మరికల్ – అప్పంపల్లి మధ్య పెట్రోల్ బంకు వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు కారణంగా 24 గంటల నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో ఇక్కడ చేసిన పైపులైన్ మళ్లీ లీకేజీ కావడంతో ఆ స్థానంలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయడం కోసం 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలివేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment