సబ్‌సెంటర్ల ద్వారా కూడా..
తూడుకుర్తిలోనే కాకుండా ఆస్పత్రి పరిధిలోని ఉపకేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, వనపర్తి, కొత్తకోట, తెలకపల్లి, కల్వకుర్తి, లింగాల, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఉపకేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా కేంద్రల వద్ద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అక్కడే కంటి పరీక్షలు చేసి.. చికిత్స అవసరమైన వారిని అంబులెన్స్‌లో తీసుకెళ్లి వైద్యసేవలు అందిస్తారు. సబ్‌సెంటర్ల ద్వారా 4,56,45 మందికి సేవలు అందించారు. అలాగే గ్రామాల్లో సైతం వైద్య సేవలు విస్తరిస్తున్నారు. ఫీల్డ్ స్టాఫ్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం పేషెంట్లను ఇంటి వద్దే దింపి వారికి అద్దాలు, మందులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment