నారాయణపేట: ప్రతి వాహనదారుడు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని.. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమన్నారు. హెల్మెట్ ధరించడం భద్రతకు అవసరమని గుర్తించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం రోడ్డు భద్రత నియమాలకు విరుద్ధమని.. జరిమానా విధించడం తప్పదన్నారు. త్వరలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment