దరఖాస్తు చేసుకోండి
కోస్గి రూరల్: గుండుమాల్ మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి ఫిబ్రవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నీలిమవర్షిణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో 100 సీట్లతో పాటు 7నుంచి 10 తరగతుల్లో మిగు లు సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గడువు పెంపు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలు, బోధన రుసుముల పథకానికి దరఖాస్తు గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.ఉమాపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు విధించగా.. దరఖాస్తులు తక్కువగా వచ్చాయన్నారు. అయితే విద్యార్థులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించిందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెల్లకందులు
క్వింటా రూ. 8,525
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌యార్డులో సోమవారం తెల్ల కందులు క్వింటా గరిష్టంగా రూ. 8,525, కనిష్టంగా రూ. 6,909 ధరలు పలికాయి. ఎర్రకందు లు గరిష్టంగా రూ. 8,288, కనిష్టంగా రూ.6, 262, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,493, కనిష్టంగా రూ. 1,800 ధరలు వచ్చాయి.
మెడికల్ బిల్లులు
మంజూరు చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో పనిచేస్తు న్న ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ బోర్డు మెంబర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అ ధ్యక్షుడు వై.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల చికిత్సకు రూ. వేలు ఖర్చుచేసి, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరగా బిల్లులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల బిల్లు లను ఆయా క్రమపద్ధతిలో మంజూరు చేస్తూ.. పెండింగ్ బిల్లులను క్లియరెన్స్ చేయాలని కోరా రు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘువీర్, జనార్దన్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ఊట్కూర్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టి, సకాలంలో పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ పీడీ శంకర్ అన్నారు. సోమ వారం ఊట్కూర్‌లో ఇళ్ల సర్వేను పరిశీలిస్తున్నా రు. దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సర్వేయర్లకు సూచించారు. ఎవరైనా గ్రామంలో లేకపోతే సమాచారం అందించి, సర్వేను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి శ్రీనివాసరావు, పోలప్ప, కనకప్ప ఉన్నారు.
కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశు సంతతి
కృష్ణా: కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశువులను పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి అన్నారు. కృష్ణా మండలం గుడెబల్లూర్ పంచాయతీ పరిధిలోని మారుతినగర్‌లో సోమవారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు పలు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. అనంతరం పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు తమ పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి సంతతిని పొందాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు రమణ సిద్దార్థ, శరత్, నరేందర్, సురేష్, రోహిత్, శశికుమార్, ఉత్తేజ్ కు మార్, లింగప్ప, హన్మంతురావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment