నర్వ: కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నా రు. సోమవారం కోయిల్‌సాగర్ ఫేస్–1 పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పంప్‌హౌజ్‌లో నెలకొన్న సమస్యలను ఈఈ ప్రతాప్‌సింగ్ ఎమ్మెల్యేకు వివరించారు. ఆయకట్టు సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన నీటిని తోడిపోసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మోటార్లు, ఇతర పరికరాల మరమ్మతుల వివరాలను తెలుసుకున్నారు. అవసరమైన పనులను వేసవిలోనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో డీఈ ఖాజానయిమొద్దీన్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీ ఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, జగదబిరాంరెడ్డి, కృష్ణారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, వివేక్‌వర్ధన్‌రెడ్డి, సంజీవరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment