ఎస్‌ఎస్‌ఆర్– 2025 డ్రాఫ్టు
పార్లమెంట్ ఎన్నికలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం స్పెషల్ సమ్మరీ రివిజన్– 2025 తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 20న ప్రారంభమైన ఎస్‌ఎస్‌ఆర్ ప్రక్రియ బీఎల్‌ఓల శిక్షణ, ఇంటింటి సర్వే అనంతరం డ్రాఫ్టు ఎస్‌ఎస్‌ఆర్–2025 జాబితాను గతేడాది అక్టోబర్ 29న విడుదల చేశారు. తదనంతరం చేర్పులు, మార్పులతో పాటు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి కొత్త దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాల నమోదుకు అవకాశం కల్పించి ఈ నెల 6న తుది జాబితాను ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్– 2025 ప్రకారం ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 17,43,276, పురుషులు 17,10,989, ఇతరులు 89 మంది ఉన్నారు. మరో 1,899 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. సర్వీస్ ఓటర్లతో కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు 34,56,253 మంది ఉన్నారు. వీరి కోసం 3,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ షె డ్యూల్ ప్రకారం 2024 అక్టోబర్ 29న ప్రకటించిన ఎస్‌ఎస్‌ఆర్– 2025 డ్రాఫ్టు ఓటర్ల జాబితా కంటే తుది జాబితాలో 13,404 మంది ఓటర్లు పెరగడం గమనార్హం.
● ఎస్‌ఎస్‌ఆర్– 2025లో ఓటరు నమోదుకు జనవరి 1 అర్హతగా తీసుకొని కొత్త దరఖాస్తులను స్వీకరించింది. గతేడాది మే నెలలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే ఎస్‌ఎస్‌ఆర్– 2025 తుది జాబితాలో 39,164 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. తాజాగా విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్–2025 ఓటర్ల తుది జాబితా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఆయా రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసినట్లయ్యింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎస్‌ఎస్‌ఆర్– 2025 ఓటర్ల తుది జాబితా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓటరు తుది జాబితా విడుదల
గతంలో విడుదల చేసిన జాబితాల ప్రకారం
మరో 1,899 మంది సర్వీస్ ఓటర్లు
కొత్తగా 39,164 మందికి ఓటుహక్కు
3,190 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
కల్వకుర్తి, కొల్లాపూర్ మినహా
అన్నిచోట్లా మహిళలే అధికం
స్పెషల్ సమ్మరీ రివిజన్– 2025లో
బహిర్గతం
Comments
Please login to add a commentAdd a comment