‘నూతన’ ఉత్సాహం..
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా సందడి కనిపించింది. ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు కిటకిటలాడాయి. చిన్నా,పెద్ద తేడా లేకుండా న్యూఇయర్ వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు. ఇళ్ల ముందు వివిధ ఆకృతుల్లో రంగవల్లులతో అలంకరించారు. వాటి మధ్యలో ‘వెల్‌కం న్యూఇయర్–2025’ అనే అక్షరాలు వచ్చేలా ముగ్గులను తీర్చిదిద్దారు. కుల, మతాలకతీతంగా నూతన సంవత్సర కేక్‌లు కట్ చేసి గ్రీటింగ్స్ తెలుపుకొన్నారు. ఇదిలాఉండగా, డిసెంబర్ 31న యువత, చిన్నారులు కలిసి వీధుల్లో కేకులు కట్ చేసి స్పీకర్లు ఏర్పాటు చేసుకొని నృత్యాలు చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకొరు. పలువురు ఇళ్లలో కేకులు కట్ చేసుకుని ఆనందంగా గడిపారు. తెల్లవారుజామున నుంచి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సింగారం, కొల్లంపల్లి చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
– నారాయణపేట రూరల్
Comments
Please login to add a commentAdd a comment