‘అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి’
మక్తల్: పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కేఎన్‌పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. మేధావిని అవమానపర్చడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కృష్ణ, అరుంధతి, జుట్ట హన్మంతు, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్, రామాంజనేయులుగౌడ్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు పృథ్విరాజ్, సూర్యచంద్ర, శ్రావణ్, కళ్యాణం రాజు, జోగిని వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ హజమ్మ, నారాయణ, తిమ్మప్ప, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment