ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ పలు ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైద్యుల సేవలను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది, మధ్యాహ్నం రెండు గంటలకు.. అంటే వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వైద్యులు హాజరును నమోదు చేసుకోవాలి. అయితే పలువురు వైద్యులు ఉదయం నిర్ణీత సమయానికి వచ్చి థంబ్ పెట్టి.. హాజరు నమోదు చేసుకుంటున్నారు. గంట, రెండు గంటల పాటు ఉండి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మళ్లీ వచ్చి హాజరు నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా జనరల్ ఆస్పత్రులకు సంబంధించిన ఉన్నతాధికారులు, అటు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద పెద్ద పెద్ద బోర్డులపై ప్రభుత్వ వైద్యుల పేర్లు బాహాటంగా కనిపిస్తున్నా.. చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment