ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–26 విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు https://tgcet.cgg.gov.in వెబ్సైట్లో ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తునకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నంబర్లు, ఆధార్‌కార్డు నంబరు, బర్త్ సర్టిఫికెట్, ఫొటో అవసరమని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment