మక్తల్: నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరైందని, ఈమేరకు జీఓ సైతం విడుదల అయ్యిందని మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి వివరించారు. సోమవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఈ సెంటర్ మంజూరైందని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మక్తల్‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ ఈ నెల 21న పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, త్వరలోనే 150 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేస్తామని, తేదీ త్వరలో వెల్లడిస్తామన్నారు. నాయకులు రవికుమార్, గాయత్రి, అనిల్, రమేస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment