ప్రతి పేదింటికి సంక్షేమ ఫలాలు
మక్తల్: ప్రతి పేదింటికి ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డు, మండలంలోని కర్ని గ్రామంలో మంగళవారం నిర్వహించిన సభలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకాలు అర్హులందరికీ అందేలా చూ స్తామన్నారు. అందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డుసభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవే ర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నా రు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్స న్ అఖిలారెడ్డి, కమిషనర్ భోగేశ్వర్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, డైరెక్టర్ రంజిత్‌రెడ్డి, కట్ట సురేష్, రవికుమార్, శ్రీనివాసులు, శంషొద్దీన్, రా మాంజనేయులు, ఫయాజ్, భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment