వాతావరణం
తెల్లవారుజామున, రాత్రి చల్లని గాలులు వీయడంతోపాటు మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ప్రభావం ఉంటుంది.
ప్రధానికి కృతజ్ఞతలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ ప్రజా ఆమోద బడ్జెట్. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం శుభపరిణామం. పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్ (01ఎంబీఎన్‌ఆర్‌ఎల్900)
వినతులు బుట్టదాఖలు
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని చేసిన మా వినతులు బుట్టదాఖలయ్యాయి. కనీసం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రజలు ఏటా రూ.లక్ష కోట్ల వరకు పన్నులు కడుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment