నారాయణపేట
వార్షిక బ్రహ్మోత్సవాలు
జోగుళాంబదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వివరాలు IIలో u
ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా మారే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం అందించాలన్న డిమాండ్ ఉండగా.. బడ్జెట్‌లో దీనిపై ప్రస్తావనే కరువైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సిన భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ఉమ్మడి పాలమూరులోని కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఉమ్మడి జిల్లాలోని పురాతన, ప్రముఖ దేవాలయాలకు ప్రసాద్ స్కీం పథకం కింద కేంద్రం నుంచి నిధులు అందుతాయని ఆశించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు లేకుండాపోయింది.
సులభంగా రుణాలు..
వ్యవసాయ రంగంలో సాంకేతికత పెంచడం, వలసలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంది. పంటల ఉత్పాదకత, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంచాయతీ, బ్లాక్ స్థాయిల్లో గోదాంలు, నీటి పారుదల, రుణ సౌకర్యాలను మరింత పెంచాలని నిర్ణయించింది. అలాగే రైతుల పెట్టుబడి కోసం అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేయకుండా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 5.50 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో ఖర్చులు, పరికరాల కొనుగోలు కోసం రైతులు స్వల్పకాలిక రుణాలు పొందవచ్చు. రానున్న ఐదేళ్లపాటు పత్తి పంట ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పత్తి పంట మద్దతు ధర పెంచేందుకు అవకాశం ఉంది.
చేనేత కార్మికులకు దన్ను..
ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా దేశంలో తయారైన స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఉన్న మర మగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,600 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపుతో చేనేత దుస్తుల ధరలు తగ్గనున్నాయి. కాగా.. పొగాకు, సిగరెట్లపై పన్నులను కేంద్రం పెంచడంతో వాటి ధరలు మరింత పెరగనున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని, అలా చేస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని, చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు.
ఎంపీటీసీ స్థానాల
పునర్విభజనకు నోటిఫికేషన్
మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎంపీడీఓ నర్సింహారెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్దూరు మున్సిపాలిటీగా, కొత్తపల్లి నూతన మండలంగా మారడంతో ఎంపీటీసీల పునర్విభజన జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 3 నుంచి 4 వేల మధ్యల ఉన్న జనాభాకు ఒక్క ఎంపీటీసీ చొప్పున విభజన చేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా మద్దూరు మండల పరిషత్‌కు 11 ఎంపీటీసీ స్థానాలకు విభజించాలని, కొత్తపల్లి మండల పరిషత్‌కు 7 ఎంపీటీసీ స్థానాలుగా విభజించాలని వచ్చినట్లు అయన పేర్కొన్నారు. వీటిని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండు మండలాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి ఫైనల్ పబ్లికేషన్ ఈ నెల 3న వెలువరించనున్నట్లు తెలిపారు.
తెల్ల కందులు క్వింటాల్ రూ.7,850
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం తెల్ల కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,850, కనిష్టంగా రూ.6,200 ధన పలికింది. అలాగే, వేరుశనగ గరిష్టంగా రూ.5,670, కనిష్టంగా రూ.3,150, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,450, కనిష్టంగా రూ.6,200 ధరలు పలికాయి.
పీయూ అధ్యాపకుడికి డిజైన్ పేటెంట్ రైట్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఎంబీఏ విభాగ అధ్యాపకుడు అర్జున్‌కుమార్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్టర్‌పై డిజైన్ విభాగంలో పేటెంట్ రైట్ పొందారు. ఈ మేరకు పరికరం రూపకల్పనలో మొత్తం ఆరుగురు అధ్యాపకులు పాల్గొన్నారని అర్జున్‌కుమార్ పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఐఏ ఆధారిత పరికరం అని, ఆర్థిక పరమైన వార్తలు, మార్కెట్ డేటా, సోషల్ మీడియా సెంటిమెంట్ వంటి అంశాలను విశ్లేషించి స్టాక్ మార్కెట్‌ను అంచనా వేస్తుందని తెలిపారు.
● ఉమ్మడి జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులకు తప్పని భంగపాటు
● పర్యాటక రంగ అభివృద్ధికిలభించని చేయూత
● ఊసేలేని మాచర్ల– గద్వాల, కొత్త రైల్వే మార్గాలు
● రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుపై హర్షాతిరేకాలు
● కిసాన్ క్రెడిట్ కార్డుతో 5.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం
● స్వదేశీ దుస్తులకు పన్ను తగ్గింపుతో 4,600 చేనేత కార్మికులకు మేలు
● ఈసారి నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగం తర్వాత గ్రామీణాభివృద్ధికే అత్యధిక శాతం నిధులు కేటాయించింది. ఈ మేరకు మొత్తం రూ.2,66,817 కోట్ల కేటాయింపులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించనుంది. దీంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వేగంగా అడుగులు పడనున్నాయి. ఆ తర్వాత వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి విరివిగా రుణాలు మంజూరు చేయనున్నారు. అంగన్‌వాడీ పోషణ్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా చిన్నారులకు పోషకాహారం పెంచడంతో పాటు మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డే కేర్ కేన్సర్ సెంటర్స్’ ఏర్పాటు చేయనున్నారు.
వేతనజీవులకు ఊరట
కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపుతో వేతన జీవులకు ఎంతో ఊరటనిస్తుంది. నూతన స్లాబ్ రేటు ఆశాజనకంగా ఉంది. – షేర్ కృష్ణారెడ్డి, నరసింహ,
తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
ఒరిగిందేమి లేదు
బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బీహార్, ఏపీ రాష్ట్రాలే కనిపించాయి. ఇతర రాష్ట్రాలు కనిపించలేదు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ గాల్లో లెక్కలు.. అంకెల గారడీలే కనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగిందేమి లేదు.
– ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట
కరుణించని.. నిర్మలమ్మ
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment