మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో నమోదైన గంజాయి కేసులే తప్ప కొత్త కేసులేమి లేవని చెప్పారు. తమ పోలీసు శాఖతో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఎకై ్సజ్ శాఖ, వైద్య శాఖ అధికారులు నిషేధం అమలుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. తమ శాఖ మాదకద్రవ్యాల నిషేధంపై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టామని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్యలకి్‌ష్మ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమాలపై తమకు సమాచారం ఇస్తే తమ శాఖ తరఫున వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని ఆరోగ్య పరంగా సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ 14416 నంబర్‌కు ఫోన్ చేసి తెలిపితే మెడికల్ కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల నిషేదిత జిల్లాగా మార్చాలని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆర్డీవో రామచందర్ నాయక్ కోరారు. సమావేశంలో ఆర్టీఓ మేఘా గాంధీ, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు అఖిల ప్రసన్న, రాణి దేవి, ఎకై ్సజ్ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలు, పాఠశాలల్లో విధిగా అవగాహన కార్యక్రమాలు : డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment