రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ
బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి వివక్ష చూపుతోంది. బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం శూన్యం. పదే ళ్లుగా ప్రతి బడ్జెట్ లో మొండిచేయి తప్పడంలేదు. రాష్ట్రం నుంచి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదు. తెలంగాణపై కేంద్రం మొదటి నుంచి సవతితల్లి ప్రేమ చూపుతోంది. – డా. చిట్టెం పర్ణికారెడ్డి,
ఎమ్మెల్యే, నారాయణపేట
ఉపాధి వేతనం పెంచాల్సింది
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మరింత ప్రా ధాన్యత ఇవ్వాల్సి ఉండేది. ఉపాధి కూలీలు తమ వేతనాలు పెంచాలని గత ఐదేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మొర పెట్టుకుంటున్నారు. ఈ బడ్జెట్‌లో పెంచాల్సి ఉండేది. జిల్లాకు నిధులను తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ పై ఉంది. సైనిక్ స్కూల్, కృష్ణా – వికరాబాద్ రైల్వేలైన్ పనులు చేపట్టేందుకు కృషి చేయాలి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు తీసుకురావాలి. కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను శాఖ విభాగంలో స్లాబ్రేట్లను సరళించి మద్యతరగతి కుటుంబాలకు ఉద్యోగులకు రూ. 12 లక్షల వరకు మినహయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. – ఎస్.రాజేందర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment