మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా శనివారం మండలంలోని కాట్రెవ్‌పల్లి, యర్నాగన్‌పల్లి గ్రామాల్లో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులు సర్వే పనులు చేపట్టారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండలం కాట్రెవ్‌పల్లి, యర్నాగన్‌పల్లి, ఊట్కూర్ మండలం బాపుర్, నారాయణపేట మండలం పేరపళ్ల దగ్గర పంపుహౌస్‌లు నిర్మించనున్నారు. ఈమేరకు కాట్రెవ్‌పల్లి గ్రామం దగ్గర పంపుహౌజ్ నిర్మాణానికి 55 ఎకరాల భూమిని సర్వే చేశారు. అనంతరం ఎవరి పొలంలో, ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి పోయిందని తెలియజేయడం జరుగుతుందని అధికారులు రైతులకు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ నాగశివ, సర్వే అధికారులు తాను, రాజన్న, అరుణ, రెవిన్యూ డిపార్టు మెంట్ ఆర్‌ఐ రాములు తదితనులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment