స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 10 మైనార్టీ పాఠశాలల్లో 5వ తరగతిలో మొత్తం సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 10 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఎల్‌టీ, సీఎస్, ఏటీ సీజీటీ (జనరల్, ఒకేషనల్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎలాంటి రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో https://tgmreistelangana.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్‌లో ఆయా పాఠశాలలు లేదా కళాశాలల ప్రిన్సిపాళ్లకు వచ్చే నెల 28లోగా దనఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment