నారాయణపేట: గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలీస్ గౌరవ వందనం, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, అవార్డ్స్ కొరకు 22 వరకు పేర్లు పంపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ శాలం, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీఎస్పీ లింగయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment