షెడ్యూల్ ప్రకారంగ్రామసభలు
ఊట్కూరు: మండలంలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ సక్తాపట్నాయక్ అన్నారు. సోమవారం మండల పరిషత్ భవనంలో సోమవారం అధికారులతో గ్రామసభలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో గ్రామసభల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జాబితాలను గ్రామసభలో విధిగా చదివి ప్రజలచే ఆమోదింప చెయ్యాలని సూచించారు. కొత్త రేషన్‌కార్డులపై దరఖాస్తులను అధికారులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. మండలంలో నాలుగు బృందాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలను విజయవంతం చెయ్యాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ రవి, ఎంపిడిఓ ధనుంజయ్యగౌడ్, వ్యవసాయ అధికారి గణేష్‌రెడ్డి, ఆర్‌ఐ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,960
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.3,339 ధరలు పలికాయి. అలాగే, వడ్లు సోన గరిష్టంగా 2,469 కనిష్టంగా రూ.2,360, తెల్ల కందులు గరిష్టంగా 8,179 కనిష్టంగా రూ.6,500, ఎర్రకందులు గరిష్టంగా రూ.8,002 కనిష్టంగా రూ.6,570 ధర పలికాయి.
ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నారాయణపేట: విద్యుత్ సంస్థలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రామరెడ్డి, బాల్‌రాంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలకు వారు మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ కార్మికులుగా గుర్తిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమానికి తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిలే దీక్షలు చేపట్టిన వారిలో సురేష్ కుమార్, భీంశప్ప దిల్దార్, భగవంతరెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభచూపాలి
మహబూబ్‌నగర్ క్రైం: ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు కరీంనగర్‌లో జరిగే 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న పోలీస్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న వారితో డీఐజీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రస్థాయితోపాటు జాతీయ స్థాయిలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. జోగుళాంబ జోన్ గర్వపడే విధంగా క్రీడల్లో ప్రతిభ చూపాలని కోరారు. పోలీస్ శాఖ అంటే చట్టాన్ని అమలు చేయడంతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, నారాయణపేట ఏఆర్ ఏఎస్పీ రియాజ్ ఉల్‌హక్ తదితరులు పాల్గొన్నారు.
24న సీనియర్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్‌లో వచ్చేనెల 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment