ఆశాలకు కనీస వేతనం అందించాలి
నారాయణపేట రూరల్: ఆశాలకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ మహాపాదయాత్ర చేపడుతున్నట్లు, జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి , బాల్‌రాం, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. ఈమేరకు సోమవారం జిల్లా ఆస్పత్రిలోని పీపీ యూనిట్ సూపర్‌వైజర్ తబితరాణికి, నారాయణపేట డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పనికి తగ్గ పారితోషికం అంటూ కేవలం రూ.9750 మాత్రమే ఆశాలకు నెలకు చెల్లిస్తున్నారని, పారితోషికంతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసిన గత ప్రభుత్వం ఆశాల వేతనం పెంచలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు కనీస వేతనం రూ.18వేలు చేస్తామని ఎన్నికల మేనోఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆశాలకు కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం అప్పక్‌పల్లి నుంచి కలెక్టరేట్ వరకు ఆశాల మహా పాదయాత్ర ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు శ్రీదేవి, రేణుక, విజయలక్ష్మి, మమత,నర్సమ్మ, రమాదేవి, భాగ్యమ్మ, నర్మద, రషీద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment