వార్డుసభల్లో భాగస్వాములు కావాలి
నారాయణపేట: మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వార్డు సభలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భాగస్వామ్యమై అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్‌లో పట్టణ అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలు అందే విధంగా కృషిచేయాలన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీలు అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అందించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా పార్టీ శ్రేణులు పాటుపడాలని సూచించారు. సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ ప్రసాద్ గౌడ్, వకీల్ సంతోష్, గందే చంద్రకాంత్, సరాఫ్ నాగరాజ్, కౌన్సిలర్ మహేష్, మల్లేష్, రెహమాన్ చాన్, యూసుఫ్ తాజ్, మహమూద్ ఖురేషి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment