సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం, కరోనా వైరస్ కేసుల విజృంభణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కోవిడ్-19, ఆర్థిక వ్యవస్థ దీనస్థితిపై తాను హెచ్చరిస్తునే ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని..ఆపై ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూశామన్నారు. చైనా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..వారు వినిపించుకోవడం లేదని రాహుల్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, చైనాతో సరిహద్దు వివాదం సహా పలు కీలకాంశాలపై రాహుల్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. చైనాతో వివాదంపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రాహుల్ గత కొద్దిరోజులుగా ట్విటర్‌లో పలు వీడియోను షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత ప్రతిష్టను పెంచుకోవడంపై నూరు శాతం దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దేశంలో వ్యవస్ధలు సైతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. జాతీయ విజన్‌కు ఒక వ్యక్తి ఇమేజ్ ప్రత్యామ్నాయం కాబోదని రాహుల్ గురువారం వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ విక్రమ్ జోషి హత్యపైనా యూపీ సర్కార్ తీరును ఇటీవల ఆయన ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment