మొబైల్‌లో కథలు | Sakshi
Sakshi News home page

మొబైల్‌లో కథలు

Published Sun, May 5 2024 3:25 AM

-

నిర్మల్‌ రూరల్‌: వేసవి సెలవుల్లో విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెలవుల్లో ప్రతిరోజూ కొత్త కొత్త కథలు వినిపించేందుకు రూమ్‌ టు రీడ్‌ ఇండియా సంస్థ సహకారంతో ఓ మొబైల్‌ నంబర్‌ను ఏర్పా టు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన పో స్టర్‌ను శనివారం డీఈవో కార్యాలయంలో డీ ఈవో రవీందర్‌రెడ్డి, అధికారులు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. మొబైల్‌ లేదా ల్యాండ్‌ లైన్‌ నుంచి 040–45209722 నంబర్‌కు ఫోన్‌ చేస్తే రోజుకు ఓ కొత్త కథ వినిపిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు రోజుకు ఒక కథ వింటూ వారి గ్ర హణ శక్తిని పెంపొందించుకోవాలని సూచించా రు. కథలు వినడం ద్వారా సొంతంగా కథలు తయారు చేసే సృజనాత్మక శక్తి, ఊహాశక్తి పెరుగుతుందన్నారు. జూన్‌ 12వరకు ఈ కథలను ప్రతిరోజూ వినవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్వోలు నర్సయ్య, సలోమి కరుణ, రాజేశ్వర్‌, ప్రవీణ్‌, వెంకటరమణ, రూమ్‌ టు రీడ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గోనె రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement