నేడు కాగజ్‌నగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా | Sakshi
Sakshi News home page

నేడు కాగజ్‌నగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Published Sun, May 5 2024 3:25 AM

-

కౌటాల/కాగజ్‌నగర్‌రూరల్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కాగజ్‌నగర్‌ పట్టణానికి కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఆదివారం రానున్నారు. మధ్యాహ్నం 3.20గంటలకు పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌కు మద్దతుగా జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సభ ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. బహిరంగ సభకు కేంద్ర భద్రత సిబ్బందితోపాటు జిల్లా ఎస్పీ సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Advertisement
Advertisement