● రూ.4.63 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ● స్థానిక
జిల్లా వివరాలు
గ్రామ పంచాయతీలు : 400
మల్టీపర్పస్ వర్కర్స్ : 1624
72 జీపీలకు విడుదలైన ట్రాక్టర్ కిస్తీలు :
రూ.12,16,719
సీసీ చార్జీలు : రూ.82,45,000
3000 లోపు జనాభా కలిగిన
జీపీలకు నిధులు : రూ.1,84,50,000
8000 లోపు జనాభా కలిగిన
జీపీలకు నిధులు : రూ.18,75,000
8000కు పైగా జనాభా కలిగిన
జీపీలకు నిధులు : రూ.1,99,076
1,624 మంది మల్టీపర్పస్ వర్కర్స్‌కు : రూ.1,63,48,399
చించోలి(బి) గ్రామ పంచాయతీ కార్యాలయం
నిర్మల్‌చైన్‌గేట్: ఇన్నాళ్లూ నిధుల లేమితో పల్లెల్లో పాలన పడకేసింది. ట్రాక్టర్ కిస్తీలు, కరెంటు బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపులు లేక, పనులు సాగక ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలన అస్తవ్యస్తంగా మారుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగును ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. వీటిని దూరం చేయడానికి, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది.
రూ.4.63 కోట్ల ఎస్‌ఎఫ్‌జీ నిధులు..
నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచా యతీలకు కాస్త ఉపశమనం లభించింది. ట్రాక్టర్ల ఈ ఎంఐలు, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలతో పాటు స్వచ్ఛదనం–పచ్చదనం, తదితర కార్యక్రమాలకు వెచ్చించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం రూ.4.63 కోట్ల ఎస్‌ఎఫ్‌జీ (స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్) నిధులను విడుదల చేసింది. పాలకవర్గాల పదవీకా లం పూర్తయినప్పటి నుంచి నిధుల కొరతతో పంచాయతీల్లో పాలన పడకేసింది. జీపీ అవసరాలకు నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప ంచాయతీ కార్యదర్శులు తాజాగా నిధుల మంజూ రుతో ఊపరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మంజూరైన నిధుల్లో నుంచి ట్రాక్టర్ల ఈఎంఐలకు రూ.12.16 లక్షలు, సీసీ చార్జీలు రూ.82.45 లక్షలు, కార్మికుల వేతనాల కోసం రూ.1.63 కోట్లు, స్వచ్ఛదనం–పచ్చదనం కోసం రూ.2.03 కోట్లు వెచ్చించనున్నారు.
కాస్త ఊరట...
జిల్లాలోని 72 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ కిస్తీలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు నిధులు రావడంతో ఇబ్బందులు తీరనున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులకు సెప్టెంబరు నెలతో మరో రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వేతనాలకు ని ధులు కేటాయించారు. ఎట్టకేలకు ట్రాక్టర్ కిస్తీలకు, కరెంటు బిల్లులు, ఇతర అభివృద్ధి పనులు, పంచా యతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు విడుదల చే యడంలో కార్యదర్శులు ఆర్థిక భారం నుంచి బయటపడ్డారు. అసలే వర్షాకాలం.. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment