ఇలేగాం ఆదర్శంగా నిలవాలి
భైంసారూరల్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అందరికీ ఆదర్శంగా ఇలేగాం గ్రామం నిలవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పిలుపునిచ్చారు. బుధవారం గ్రామంలో స్వచ్చత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో, పారిశుధ్య కార్మికులు, మహిళలతో కలిసి ప్రధాన రోడ్లను శుభ్రంచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలని సూచించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఇలేగాం జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు ద్వారా శుభకార్యాల్లో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో సుదర్శన్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకి భీంరావు, తాలోడ్ శ్రీనివాస్, సాంవ్లీ రమేశ్, కాంబ్లే సుభాష్, సుష్మారెడ్డి, వీడీసీ చైర్మన్ కోల రత్నాకర్, ఉపాధ్యక్షులు పెర్తన్‌పెల్లి శంకర్, కోశాధికారి కౌటిక్‌వార్ కృష్ణమూర్తి, సభ్యులు దేవిదాస్‌పటేల్, మాజీ ఎంపీటీసీ ఉప్పు రాజన్న, కార్యదర్శి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment