మోడల్ పోలీస్ స్టేషన్‌కు మోక్షమెప్పుడో..!
● నూతన భవనానికి రూ.72 లక్షలు కేటాయింపు ● పనులు ప్రారంభించి ఏడేళ్లు.. నేటికీ పూర్తికాని వైనం ● పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్న పోలీసులు
లక్ష్మణచాంద: పోలీసులకు సకల హంగులతో కూడిన నూతన భవనం అందుబాటులోకి తీసుకరావాల ఏడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మణచాందకు మోడల్ పోలీస్‌స్టేషన్ మంజూరు చేసింది. రూ.72 లక్షలు కేటాయించింది. పనులు ప్రారంభమై ఏడేళ్లు గడిచినా నిర్మాణం పూర్తి కాలేదు.
2017 పనులు ప్రారంభం...
లక్ష్మణచాంద పోలీస్‌స్టేషన్ భవనం పురాతనమైనది కావడంతో ఇబ్బందుల మధ్యనే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2017లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. రూ.72 లక్షలు కేటాయించింది. దీంతో అదే ఏడాది నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఎస్సై గది, పీసీల విశ్రాంతి గది, మహిళ పీసీలకు ప్రత్యేక విశ్రాంతి గది, ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలకు పెద్ద హాల్, రిసెప్షన్ గది, రికార్డులు భద్రపరిచే గది, ఇంటర్‌నెట్ సౌకర్యం వంటి అన్ని సదుపాయాలు కల్పించాలి.
నిధుల విడుదలలో జాప్యం..
2017లో ప్రారంభమైన పనులు 2024 వచ్చినా అసంపూర్తిగానే ఉంది. కిటికీలు, విద్యుత్ సౌకర్యం, డోర్లు, నీటి సౌకర్యం, కలర్స్, ఇతరత్రా మైనర్ పనులు కొనసాగుతున్నాయి. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో భవనం నిర్మాణ పనులు పూర్తి కావడం లేదని కాంట్రాక్టర్ తెలిపాడు. మొత్తం రూ.72 లక్షలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.40 లక్షలు మాత్రమే విడుదల చేశాని పేర్కొన్నాడు. మరో రూ.32 లక్షలు రావాల్సి ఉందన్నాడు. నిధులు విడుదల చేస్తే ఈనెలాఖరులోగా పనులు పూర్తిచేసి భవనం అందుబాటులోకి తెస్తామని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment