గ్రూప్–3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ఈ నెల 17, 18 తేదీలలో జరగనున్న గ్రూప్–3 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8,124 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, జిరాక్స్ సెంటర్లను మూ సివేయించాలని, ఆయా రూట్లలో సరిపడా ప్రత్యే క బస్సులు నడపాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో రవీందర్‌రెడ్డి, పరీక్షల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి గంగారెడ్డి, డీఎంహెచ్‌వో రా జేందర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.
హైరిస్క్ గర్భిణులపై పర్యవేక్షణ ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్: హైరిస్క్ గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ లో గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భం దాల్చిన వెంటనే మహిళలకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి హైరిస్క్ గర్భిణులను గుర్తించి అవసరమైన మందులు అందించాలన్నారు. వారిపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, అవసరమైన వైద్యచికిత్సలు అందించాలన్నారు. వైద్యాధికారుల సమన్వయ సహకారంతో జిల్లాలో గర్భస్థ మరణాలను నియంత్రించాలన్నారు. ప్రతీ గర్భిణికి ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతను వివరించాలన్నారు. రక్తహీనత నివారణ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, వైద్యాధికారులు శ్రీనివాస్, సురేష్, సౌమ్య, సరోజ, నయనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment