దిలావర్‌పూర్: మండలంలోని న్యూలోలం గ్రామంలో ఉన్న అంబవాయి కుంటను బుధవారం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. తమ జీవనాధారమైన కుంటను ఆక్రమణపై సోమవారం గంగపుత్రులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో కుంటను పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన గంగపుత్రులు తమ కుంట నానాటికీ విస్తీర్ణం కోల్పోతుందంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. తక్షణమే రికార్డులు పరిశీలించి సర్వే చేయించాలంటూ తహసీల్దార్ స్వాతిని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment