ఇంటింటి సర్వేకు సహకరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్/మామడ: ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. మామడ మండలం న్యూసాంగ్విలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును బుధవారం తనిఖీ చేశారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటి సర్వే కోసం ఏ ఒక్క నివాస గృహం సైతం మినహాయించబడకుండా ఎన్యూమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బ్లాక్‌కు ఒకరు చొప్పున ఎన్యూమరేటర్లను నియమించామని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించాల్సిన తీరుపై వారికి శిక్షణ ఇచ్చామన్నారు. సర్వేలో భాగంగా ఈ నెల 6, 7, 8, తేదీలలో హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 9 నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందన్నారు. సర్వే బృందానికి నిర్ణీత సమాచారం అందించి సహకరించాలన్నారు.
సర్వే పారదర్శకంగా చేపట్టాలి
కుంటాల: సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. బుధవారం మండలంలోని మెదన్ పూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. జిల్లాలో 2,39,784 గృహాలకు గానూ సర్వే కోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించినట్లు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠం చెబుతూ సందేహాలు నివృత్తి చేశారు. ఆయన వెంట డీపీవో శ్రీనివాస్, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, పీఆర్ డీఈ రాజేందర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి, ఏపీవో గట్టుపల్లి నవీన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment