నిర్మల్
గురువారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2024
మయోనైజ్.. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌పాయిజన్ ఘటనలకు ఇదే కారణం. తాజాగా నిర్మల్‌లోని గ్రిల్ 9 హోటల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా ఒక యువతి మృతి చెందడంతో పాటు దాదాపు 50 మంది వరకు అస్వస్థతకు గురికావడానికి ఇదే కారణంగా తేలుతోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మయోనైజ్‌ను రాష్ట్రప్రభుత్వం అక్టోబర్ 30నే నిషేధించింది. ఏడాదిపాటు దీన్ని ఎక్కడా వినియోగించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. జిల్లాలో ఏమాత్రం నిషేధాన్ని పట్టించుకోకుండా అన్ని హోటళ్లల్లో తందూరి చికెన్, షవర్మా, చికెన్–65ఇలా.. ప్రతీ దానికి మయోనైజ్‌ను అందించడం గమనార్హం. నిషేధం విషయంలో సీరియస్‌గా తీసుకోకపోవడం, సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఓ నిండుప్రాణం పోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment