నిర్మల్‌టౌన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఉదయం 5 గంటలకు నిర్మల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉదయం 10:15 నిమిషాలకు కాళేశ్వరం చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు నిర్మల్ చేరుకుంటుందన్నారు. దీంతోపాటు ప్రతీ శని, ఆది, సోమవారాల్లో వేములవాడకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. కాళేశ్వరానికి అప్ అండ్ డౌన్ ఒకరికి రూ.1,200 అవుతుందని, వేములవాడకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.140 బస్సుచార్జీ అవుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment