బీజేపీ అభ్యర్థినే ఎమ్మెల్సీగా గెలిపించాలి
ఖానాపూర్: త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘ భవనంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఎంపీ నగేష్ హాజరై మాట్లాడారు. అనంతరం పట్టభద్రుల ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. బాదనకుర్తి గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కా ర్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, రాష్ట్ర నా యకుడు రితీష్రాథోడ్, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, బీజేపీ పట్టణ, మండల అధ్యక్షుడు నాయిని సంతోష్, టేకు ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment