నిర్మల్
గిరిజన క్రీడోత్సవం
ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలో ఐదో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశా లల విద్యార్థులు హాజరయ్యారు.
బుధవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
సోన్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్ దొడ్డురకం, పీఏసీఎస్ సన్నరకం వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు కృష్ణ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సేకరించిన ధాన్యం త్వరితగతిన రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ మల్లేశ్, ఏవో వినోద్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘అరె మామా.. మస్తు కారు కొన్నవ్.. ఏం సంగతి మరి దావత్ లేదా..!’ అని దోస్తులు అడిగినా..
‘నాన్నా.. ఈరోజు సండే కదా. సాయంత్రం బయటకెళ్దాం కదా..’ అని ఇంట్లో పిల్లలు కోరినా..
‘చలో..’అంటూ హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు వెళ్తున్నారు. ఇక్కడి దాకా వచ్చి వెజ్ తినడమేంటంటూ.. నాన్‌వెజ్‌కే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. అదే ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయం తెలియక ఆరగించేస్తున్నారు. తీరా.. ఇంటికెళ్లాక వాంతులు, విరేచనాలతో అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో జిల్లా కేంద్రంలోని గ్రిల్ 9 హోటల్‌లో తిన్నవారికి ఫుడ్‌పాయిజన్ కావడంతో ఏకంగా ఒక యువతి ప్రాణమే పోవడం దారుణం. మరో పాతికమందికి పైగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రుల పాలయ్యారు. – నిర్మల్
పదుల సంఖ్యలో బాధితులు..
నిత్యం గ్రిల్ 9 హోటల్‌లో వందలమంది భోజనం చేస్తుంటారు. ఇదేక్రమంలో శని, ఆదివారాల్లో తినేందుకు వచ్చినవారికి విషతుల్యమైన ఆహారం అందడంతో వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిర్మల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు దాదాపు ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో బాధితులు ఉన్నారు. ఖానాపూర్‌కు చెందిన యువకులు, నిర్మల్‌కు చెందిన ఓ కుటుంబసభ్యులు కలిపి దాదాపు 26 మంది వరకు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ హోటల్‌లో తినేవారితో పాటు ఇక్కడి నుంచి పార్శిళ్లను తీసుకెళ్లేవారూ ఎక్కువే ఉంటారు. ఈనేపథ్యంలో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని తెలుస్తోంది.
కుళ్లినా సరే..
హోటళ్లకు వెళ్లి చికెన్, మటన్ ఏదైనా ఆర్డర్ ఇవ్వగానే ఐదు పది నిమిషాల్లో వేడివేడిగా తెచ్చి వడ్డించేస్తారు. ఆ వేడిలో, మసాలా ఘాటులో ఆ మాంసాహారం కుళ్లిపోయిందా.. నిల్వ ఉంచిందా.. అన్న విషయం అంత త్వరగా గుర్తుపట్టలేం. ఈక్రమంలోనే చాలా హోటళ్లు మిగిలిపోయిన చికెన్, మటన్‌లను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి, మరుసటి రోజులలో వండి వడ్డిస్తున్నారు. అందులో కుళ్లినవి కూడా అలాగే వండేసి అందిస్తున్నారు. కస్టమర్ల ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా రోజుల తరబడి నిల్వ ఉంచినవి, కాస్త కుళ్లిపోయినవి కూడా అలాగే వండి సప్లయ్ చేసేస్తున్నారు.
నిషేధిత ఆహార పదార్థాలు..
రాష్ట్రప్రభుత్వం మయోనైజ్ వంటి వాటిని నిషేధించినా.. జిల్లాలోని హోటళ్లు యథేచ్ఛగా వినియోగిస్తున్నాయి. ఇక పరిమితులకు మించి ఫుడ్‌కలర్స్, టేస్టింగ్ సాల్ట్‌లను సైతం వేస్తున్నట్లు తేలుతోంది. ఆరోగ్యానికి హానికరమైనవని తెలిసినా.. టేస్టుల కోసం అధిక మోతాదులలో ఉపయోగిస్తున్నారు. ఓవైపు నిల్వ ఉంచిన మాంసం, మరోవైపు నిషేధిత, హానికర పదార్థాలతో వండటం, ఇక ఏమాత్రం పరిశుభ్రత, నాణ్యత పాటించకుండా వడ్డించడంతో.. వాటిని ఆరగించిన వారు ఫుడ్‌పాయిజన్ బారిన పడుతున్నారు. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ప్రాణం తీసిన గ్రిల్ 9
న్యూస్‌రీల్
జిల్లా హోటళ్లలో ఇష్టారాజ్యం..
రెస్టారెంట్లు, దాబాలపై పర్యవేక్షణ శూన్యం
శుభ్రత, నాణ్యతను గాలికొదిలేస్తూ..
కుళ్లిన, నిల్వ ఉంచినవి వడ్డిస్తూ..
ప్రాణాలు తీస్తున్న హోటళ్లు
మండీలో తిన్నాం..
స్థానిక గ్రిల్ 9 హోటల్‌లోని మండీలో మేమిద్దరం కలిసి చికెన్ తిన్నాం. మరుసటి రోజు నుంచి మా ఇద్దరికీ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడంతో బయటపడ్డాం. – అబ్దుల్‌రహమాన్,
మహ్మద్ సోఫియాన్, నిర్మల్
ఫుడ్ పాయిజనే...
శని, ఆదివారాల్లో వాంతులు, విరేచనాలతో పదులసంఖ్యలో పేషెంట్లు వచ్చారు. వారందరూ ఒకే హోటల్‌లో తిన్నామని చెప్పారు. ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. విషతుల్యమైన ఆహారం తినడంతోనే వీరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. – డాక్టర్ మహేశ్, నిర్మల్
జిల్లా కేంద్రంలోని మంచిర్యాలరోడ్డులో ఏఎన్‌రెడ్డి కాలనీ కమాన్ పక్కన గల గ్రిల్ 9 హోటల్‌లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారిలో దాదాపు అందరూ ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. షాపింగ్ కోసం నిర్మల్ వచ్చిన వారు ఈ హోటల్‌లో భోజనం చేసిన పాపానికి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్‌థామస్ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా (19) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ఏకంగా ప్రాణాలనే కోల్పోవడం దారుణం. ఆమెతో పాటు భోజనం చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ స్మితాజార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment